ఆ హీరోతో రకుల్‌ కెమిస్ట్రీ పీక్స్‌లో ఉందట

ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వరుసగా స్టార్‌ హీరోల చిత్రాల్లో నటిస్తూ మంచి విజయాలను తన బుట్టలో వేసుకుని స్టార్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ అమ్మడు మహేష్‌బాబుతో ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తూనే నాగచైతన్యతో ‘రారండోయ్‌వేడుక చూద్దాం’ చిత్రంలో నటిస్తోంది. అంతేకాకుండా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా నటిస్తోంది. రకుల్‌ ‘రారండోయ్‌వేడుక చూద్దాం’ చిత్రంలో చాలా గ్లామర్‌గా కనిపిస్తోంది. తాజాగా విడుదలయిన ఈ చిత్ర టీజర్‌లో రకుల్‌ చాలా అందంగా కనిపించింది.

రకుల్‌ మంచి అందగత్తె, దానితో పాటు దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ రకుల్‌ను చాలా అందంగా చూపించాడు. అందంగానే కాకుండా ఈ చిత్రంలో చైతూ, రకుల్‌ల రొమాన్స్‌ కేడా చాలా బాగుటుందట. ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యిందని యూనిట్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ చిత్రంతో నాగచైతన్య రొమాటింక్‌ హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం ఖాయం. ఈ చిత్రంలో రకుల్‌, చైతూల కెమిస్ట్రీ మాత్రం పీక్స్‌లో ఉంది అనేది తాజా సమాచారం.