ఓ వైపు బీర్‌ మరోవైపు భామతో ‘పెళ్లిచూపులు’ హీరో

కెరియర్‌ మొదట్లో పలు చిత్రాల్లో నటించినా కూడా చెప్పుకోదగ్గ ఫలితం లేని విజయ్‌ దేవరకొండకు ‘పెళ్లి చూపులు’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ యూత్‌లో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత పలు పెద్ద ప్రాజెక్ట్‌లు విజయ్‌ దరికి చేరాయి. బిజీ బిజీగా సినిమాల్లో నటిస్తున్న విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు నేడు కావడంతో ‘పెళ్లి చూపులు’ చిత్రంలో విజయ్‌ సరసన నటించిన రీతూ వర్మ శుభాకాంక్షలు తెలిపింది.

అంతేకాకుండా విజయ్‌తో ఉన్న ఫొటోను కూడా షేర్‌ చేసింది. ఈ ఫొటోలో విజయ్‌ దేవర కొండ ఇరువైపులా బీర్‌ బాటిల్‌ మరియు హీరోయిన్‌ ఉన్నారు. ఓ వైపు హీరోయిన్‌ రీతు వర్మ ఉండగా మరోవైపు బీర్‌ బాటిల్‌ ఉంది. ఇలా బీర్‌ బాటిల్‌ ఒక చేతిలో అందమైన హీరోయిన్‌ మరో చేతిలో ఉన్న ఈ ఫొటోను చూసి కుర్రకారు రకరకాలుగా ఊహించుకుంటున్నారు.