హవ్వా… హీరోయిన్ల గురించి జగ్గూభాయ్‌ ఇలా అంటున్నాడేంటి!

హీరోగా వెండితెరపై కనువిందు చేసి టాలీవుడ్‌లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న జగపతిబాబు ప్రస్తుతం విలన్‌గా మంచి జోరు మీదున్నాడు. పవర్‌ఫుల్‌ హీరోలకు పవర్‌ ఫుల్‌ విలన్‌గా జగ్గూభాయ్‌ అదరగొడుతున్నాడు. తాజాగా మీడియాతో ముచ్చటించిన జగపతిబాబు హీరోయిన్స్‌పై షాకింగ్‌ కామెంట్‌లు చేశాడు. నిన్నటితరం హీరోయిన్‌, ఇప్పటి శివగామి రమ్యకృష్ణ ఇప్పటి కుర్రకారుకి కూడా డార్లింగ్‌నేనని, ప్రియమణి తన లవర్‌లాంటిదని చెప్పుకొచ్చాడు.

త్రిష చాలా హాట్‌ గురూ…, మమత మోహన్‌దాస్‌ తన స్నేహితురాలు అని అంటున్నాడు. ఇకపోతే శృతిహాసన్‌ తన సోదరిలాంటిదని, ఆమె ఆలోచనలు, తన ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. నిన్నటితరం హీరోయిన్‌, పక్కింటి అమ్మాయి సౌందర్యతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఆమె కుటుంబంతో కూడా తనకు మంచి సాన్నిహిత్యం ఉందని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా జగ్గూభాయ్‌ హీరోయిన్లపై హాట్‌, లవర్‌, డార్లింగ్‌ అంటూ ఇలాంటి కామెంట్‌లు చేస్తూ షాకిచ్చాడు.