తెలుగోళ్ల వల్లనే కీర్తికి ఆ ఆఫర్‌ దక్కింది

ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌కు ఇటు తెలుగులోను అటు తమిళంలోను మంచి క్రేజ్‌ ఉంది. తెలుగులో రెండు చిత్రాల్లోనే నటించినా కూడా యూత్‌లో క్రేజీ భామగా మారింది. ఈ అమ్మడికి తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్‌లు వస్తున్నాయి. రెండు భాషల్లో కూడా స్టార్‌ హీరోల అవకాశాలను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ అమ్మడికి తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. విక్రమ్‌ ‘సామి 2’ చిత్రంలో నటించడానికి ముందుగా వేరే హీరోయిన్‌ను అనుకున్నారు కానీ ఆ తర్వాత కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు.

విక్రమ్‌ సరసన నటించడానికి చాలామంది అగ్ర కథానాయికలు పోటీ పడుతుంటారు. కానీ కీర్తిసురేష్‌కు మాత్రం ఆ ఆఫర్‌ చాలా సులభంగా లభించింది. తెలుగోళ్ల వల్లనే కీర్తికి విక్రమ్‌ సరసన నటించే అవకాశం దక్కింది. తెలుగులో కూడా ‘సామి 2’ చిత్రానికి బజ్‌ క్రియేట్‌ చేయాలని, తెలుగులో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్‌ ఉందని తెలుసుకుని కీర్తిని ఎంపిక చేశారు. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ భామగా హవా సాగించడం వల్లనే తక్కువ టైంలోనే విక్రమ్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. తెలుగులో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది.