డైరెక్టర్ కు తలనొప్పిగా మారిన మహేష్ కండిషన్..

బ్రహ్మోత్సవం ప్లాప్ తర్వాత మహేష్ బాబు , డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం లో స్పైడర్ మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే ..ఈ మూవీ ఫై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు..గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ కి కాల్ షీట్స్ ఇచ్చాడు. కానీ అనుకోని విధంగా ఈ మూవీ షెడ్యూల్ ఎక్స్ టెండ్ అయ్యాయి. అయినప్పటికీ ఓపిగ్గా మరిన్ని కాల్షీట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడీ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. ఈసారి మాత్రం డైరక్టర్ కు డెడ్ లైన్ పెట్టాడట మహేష్. మరో 2 వారాలు మాత్రమే టైం అంటూ కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం స్పైడర్ మూవీ ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. గతవారమే ఈ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ నాటికి సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని మహేష్ టార్గెట్ పెట్టినట్టు ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత కాల్షీట్లు ఇచ్చేది లేదని గట్టిగానే డైరెక్టర్ కు చెప్పాడట. దీంతో మురుగదాస్ రాత్రి బవళ్ళు కష్టపడుతూ , యూనిట్ ను పరుగులు పెట్టిస్తున్నాడట.

దర్శకుడు కొరటాల శివ, మహేష్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కొరటాల సినిమాకు మహేష్ అడ్వాన్స్ తీసుకొని చాలా రోజులైంది. వచ్చే నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లో కొరటాల సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు.