చైతు ‘పెళ్లి ‘ ముచ్చట్లు..

టైటిల్ చూసి చైతు – సమంత పెళ్లి ముచ్చట్లా..అని అనుకోకండి..మీము చెప్పేది నాగ చైతన్య నటించిన కొత్త చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ లోని పెళ్లి సాంగ్ ముచ్చట్లను గురించి చెపుతున్నాం..సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ సాంగ్ నిన్న సాయంత్రం మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ విడుదల చేసారు.. ‘బుగ్గచుక్క పెట్టుకుంది.. సీతమ్మా సీతమ్మా..’ అంటూ సాగే ఈ పాత శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ పాట విన్న హీరో నాని ‘బ్యూటిఫుల్‌ పాట దేవి.. ఇంక అన్ని పెళ్లి వీడియోలకి ఇదే నేపథ్యగీతం’ అని నవ్వుతూ బదులిచ్చారు. నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా రాబోతుంది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ ఫై నాగార్జున ఈ మూవీ ని నిర్మించడం జరిగింది. ఈ నెల 19 న మూవీ ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.