‘మణికర్ణిక’ మొదలైయింది

”గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా విజయంతో జోష్ మీదవున్న దర్శకుడు క్రిష్ కొత్త సినిమా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక’ పేరిట క్రిష్ తన కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. బాలీవుడ్‌లో నిర్మాణమవనున్న ఈ సినిమాకు బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి గాథ ఆధారంగా ‘మణికర్ణిక’ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకున్న ఈ చిత్రాన్ని ఇవాళ వారణాసిలో సాయంత్రం గంగా హారతి సమయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మణికర్ణికకు సంబంధించిన 20 అడుగుల పోస్టర్‌ను అవిష్కారించారు. తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కనున్న ఈ మూవీని కమల్‌ జైన్‌ నిర్మిస్తుండగా బాలీవుడ్‌ త్రయం శంకర్‌ ఇషాన్‌ లాయ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.