త్రిషకు ఛార్మి పెళ్లి ప్రపోజల్‌

చెన్నయ్‌ బ్యూటీ త్రిష పుట్టినరోజు నేడు. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్‌ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే హీరోయిన్ చార్మీ మాత్రం కాస్త వెరైటీగా విష్ చేసింది. దయచేసి కనీసం ఈ ఏడాదైనా తన పెళ్లి ప్రపోజల్‌ను అంగీకరించాలని సరదాగా ట్వీట్‌ చేశారు. దీనికి త్రిష వెంటనే స్పందిస్తూ.. ‘నేను తొలి ప్రపోజ్‌కే అంగీకరించాను. లవ్‌ యూ’ అని రీట్వీట్ చేసింది. ఛార్మి కూడా అనంతరం ‘లవ్‌ యూ’ ట్వీటింది.

వీరిద్దరి లవ్ ప్రపోజల్ వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ వుంది. గతంలో త్రిష ఓ జ్యువెలరీ మాల్‌ ఓపెనింగ్‌కు అందంగా తయారై వేలిమ్ది. అక్కడ దిగిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. వాటిని చూసిన ఛార్మి సరదాగా ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని త్రిషను ప్రశ్నించారు. త్రిష కూడా ఏ మాత్రం తడుముకోకుండా ‘నీతో పెళ్లికి నేనెప్పుడూ సిద్ధమే’ అని చెప్పింది. అప్పటి నుండి ఈ సరదా ముచ్చట వీరి మధ్య కొనసాగుతోంది.