నేపాల్ లో చెమటలు పట్టిస్తున్న బాహుబలి 2 .

బాహుబలి రికార్డ్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ప్రభంజనం సృష్టిస్తున్నాయి..ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నో రికార్డ్స్ ను అడ్రెస్ లేకుండా చేసిన బాహుబలి , పొరుగు దేశమైన నేపాల్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది..ఇప్పటికే అక్కడ పది కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలి, అతి త్వరలో నేపాల్లోనే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటి వరకు 17 కోట్లతో ‘చక్క పంజా’ అనే సినిమా అక్కడ హయ్యస్ట్ గ్రాస్ గా రికార్డ్స్ లో ఉండగా , మరో వారం రోజుల్లో బాహుబలి 2 ఈ రికార్డ్ ను చెరిపేస్తుందని తెలుస్తుంది.

ఇక బాలీవుడ్ లోను బాహుబలి హావ మాములుగా లేదు..ఓ పక్క టికెట్స్ దొరకడమే కష్టాంగా ఉంటె..స్టార్స్ మాత్రం మళ్లీ మళ్లీ సినిమా చూసి తమ ఆనందాన్ని తెలుపుతూ , సినిమా ఫై ప్రశంసలు తెలుపుతుంటే ఇక మొదటి సారి చూడాలనుకునే వారి ఆత్రుత ఇంకాస్త పెరుగుతుంది. మరో 10 రోజుల పాటు బాహుబలి మేనియా తగ్గే పరిస్థితి లేదంటున్నారు ట్రెండ్ వర్గాలు.