అక్షయ్..బ్రాండ్ అంబాసిడర్ దేనికో తెలుసా..?

చాలామంది హీరోలు , హీరోయిన్స్ బట్టల షాప్స్ కు , ఇతర బ్రాండెడ్ వాటికీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తస్తుంటారు..కానీ కొంతమంది మాత్రం ప్రజలకు ఉపయోగపడే వాటికీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు..ఎయిడ్స్, మూత్ర విసర్జన , కండోమ్ వాడకం ఇలా ప్రభుత్వ పథకాల గురించి కూడా ప్రచారం చేస్తారు. తాజాగా అక్షయ్ కుమార్ టాయిలెట్ ల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి ఒప్పుకున్నాడు.

మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పధకం ప్రవేశ పెట్టనున్నారు. మన దేశం లో టాయిలెట్లు చాల తక్కువ ఉన్నాయి. ముంబాయి లో ప్రతీ 500 మీటర్ కు ఒక టాయిలెట్ ఉండే విధంగా ఒక పధకం రూపొందించారు. మే 1 న 5000 మంది స్టూడెంట్స్ సమక్షం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రజలోకి తీసుకెళ్లేందుకు అక్షయ్ ముందుకు వచ్చాడు.