బాహుబలికి గజనీ ఫిదా

వెండితెర అద్భుతం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. ప్రముఖులు, అభిమానులు చిత్రం అద్భుతంగా ఉందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. అటు నేతలు కూడా బాహుబలి ని ప్రశంసిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య బాహుబలి పై అభినందనల జల్లు కురిపించారు.
‘రాజమౌళి సర్‌ మన చిత్ర పరిశ్రమకు చక్కటి స్ఫూర్తినిచ్చారు. అదిరిపోయింది! హాట్సాఫ్‌… ‘బాహుబలి 2′ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రాజమౌళి స్పందిస్తూ సూర్యకు ధన్యవాదాలు చెప్పారు.

బాహుబలి ది: బిగినింగ్‌’కు కొనసాగింపుగా వచ్చిన ‘..కన్‌క్లూజన్‌’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతుంది.