బాహుబలి 2 @ 700 కోట్లు.

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ..ఇప్పుడు ఖాన్ ల రికార్డ్స్ సైతం అడ్రెస్ లేకుండా చేస్తుంది..కేవలం విడుదలైన నాల్గు రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్ల వైపు పరుగులు తీస్తుందంటే అది మాములు విషయం కాదు..ఇప్పయివరకు ఇండియన్ సినిమా చరిత్రలో అమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ మూవీ రూ. 792 కోట్ల వసూళ్లు సాధించి నెంబర్ వన్ గా నిలిచింది. ఈ రికార్డును తుడిచిపెట్టేయడానికి బాహుబలి-2 సిద్ధం అవుతోంది. ఇప్పటికే దాదాపు 700 కోట్ల కలెక్షన్లకు చేరువలోకి వచ్చినట్లు సినీవర్గాల టాక్.

ఓపెనింగ్ వీకెండ్‌లోనే దాదాపు 540 కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలికి.. సోమవారం మేడే కావడం మరింత కలిసొచ్చింది. ఓవర్సీస్ బాక్సాఫీసులో కూడా ఈ సినిమా రికార్డులు బద్దలుకొడుతోంది. అక్కడ ప్రస్తుతం విన్ డీజిల్ నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్8 మొదటి స్థానంలోను, ఒక లాటిన్ సినిమా రెండో స్థానంలోను ఉండగా మూడోస్థానంలో బాహుబలి నిలిచింది.

బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్టు తరణ్ ఆదర్శ్‌ సోమవారం నాటి కలెక్షన్లతో ఈ సినిమా అన్ని రికార్డులనూ నాకౌట్ బిజినెస్‌తో బుల్డోజ్ చేసిందని, ఇప్పటికి ఇంకా ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, మొత్తం వివరాలు మళ్లీ చెబుతానని అన్నారు. అప్పటికే కేవలం హిందీ వెర్షన్‌లోనే తొలి నాలుగు రోజుల్లో 150 కోట్లు సాధించిన విషయాన్ని ఆయన ప్రకటించారు.