బాలయ్య బాహుబలి… ఎన్టీఆర్‌ భల్లాల ఫిక్స్‌

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం కలెక్షన్ల వరద పారిస్తోంది. ఈ చిత్రానికి అన్ని భాషల నుండి కూడా పాజిటివ్‌ స్పందననే వస్తోంది. ఈ చిత్రంలో భల్లాలదేవుడి పాత్ర పోషించిన రానా దగ్గుబాటి తాజాగా ఓ టీవీ షోలో పాల్గోన్నాడు. ఈ షోలో ‘బాహుబలి 2’ టాఫిక్‌ రాగా మీరు దర్శకులు అయితే ఆ పాత్రలకు గాను ఎవరిని తీసుకుంటారు అనే ప్రశ్న రానాకు ఎదురయింది. దాంతో రానా తాను నటీనటులందరిని మార్చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. రానా చెప్పింది సరదాకే అయినా కూడా రానా మాట మీదుగా ఓ కొత్త కాంభో తయారయ్యేలాగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రానా ‘బాహుబలి’కి దర్శకుడు అయితే బాహుబలి పాత్రకు పౌరాణిక పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన బాలకృష్ణను భల్లాల పాత్రలకు నేటి తరంలో ఉత్తమ నటుడైన ఎన్టీఆర్‌ను ఎంపిక చేస్తాను. ఎన్టీఆర్‌, బాలయ్యలు తలపడితే అబ్బ ఆ మజానే వేరు అంటూ రానా సరదాగా చెప్పుకొచ్చాడు. రానా సరదా మాటలు ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారాయి. బాలయ్య హీరోగా, ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ విలన్‌గా ఇద్దరు తలపడితే ఆహా ఎంత బాగుంటుందో అని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు. ఈ కాంభో మీద ఎవరికైనా ఆసక్తి కలిగితే కథను కూడా వెంటనే అల్లేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.