‘నక్షత్రం’లో సన్నీలియోన్‌ మెరువనుందా..??

శృంగారతార సన్నిలియోన్‌ పోర్న్‌ రంగం నుండి బయటకు వచ్చేసినా కూడా ఈ అమ్మడికి యూత్‌లో ఉన్న క్రేజ్‌ ఇంత కూడా తగ్గడం లేదు. సన్నీలియోన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఇక హిందీలోనే కాకుండా పలు భాషల్లో కూడా ఈ అమ్మడికి డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. సన్నీ తళుక్కున కాసేపు మెరిసినా కూడా కుర్రకారు ఉర్రూతలూగిపోతున్నారు. దాంతో సన్నీ క్రేజ్‌ను వాడుకోవాలని చాలామంది దర్శకనిర్మాతలు ఖరీదైనా కూడా సన్నీనే వాడుకోవడానికి ఇష్ట పడుతున్నారు. అందుకే ఈ అమ్మడికి తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించిన సన్నీలియోన్‌ ‘నక్షత్రం’ చిత్రంలో కూడా మెరువబోతుంది అని సమాచారం అందుతోంది. క్రియేటివ్‌ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పెద్దగా హైప్‌ లేదు. ఈ చిత్రంలో ప్రత్యేక పాట మినహా మిగతా షూటింగ్‌ అంతా పూర్తి అయ్యింది. ఆ పాటలో సన్నీ మెరిస్తే ఇక సినిమాకు ఫుల్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యి సినిమాకు బాగా పనికి వస్తుంది అని భావిస్తున్నాడు. అందుకే కాస్త రేటు ఎక్కువయినా కూడా సన్నీనే తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇక సన్నీ ‘నక్షత్రం’లో మెరిస్తే ఆ క్రేజ్‌ మామూలుగా ఉండదు.