‘బాహుబలి 2’ లో యాక్షన్‌ లేదు చాలా ఓవరాక్షన్‌

ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి 2’ని చూసిన వారంతా కూడా చాలా గొప్పగా ఉందని తెగ పొగిడేస్తున్నారు. ఇంత మంచి చిత్రానికి కూడా చెత్త రివ్యూలు లేకుండా పోలేదు. ఈ చిత్రాన్ని కూడా బాలేదు అని రివ్యూలు రాసేవారు కూడా ఉన్నారు. కన్నుల పండుగలాగా సాగే ఈ చిత్రం విడులయిన అన్ని భాషల్లో మంచి టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వరద పారిస్తోంది. ఈ చిత్రం చాలా చెత్తగా ఉందని ప్రముఖ విమర్శకురాలు ఎం ఎం వెటికాడ్‌ రివ్యూ ఇచ్చింది. ఈ చిత్రంలో నటీనటులు చాలా దారుణంగా నటించారు అంటూ వెటికాడ్‌ పేర్కోంది.

క్రిస్టియన్‌ అయిన వెటికాడ్‌కు మహాభారత ఛాయలో జరిగే ఈ చిత్రం నచ్చలేదు అని ప్రభాస్‌ అభిమానులు అంటున్నారు. ఈ చిత్రంలో అంతా యాక్షన్‌ కాకుండా ఓవరాక్షన్‌ చేశారు, ఇక కట్టప్ప, నాజర్ అయితే మరీ ఓవరాక్షన్‌ చేశాడు అంటూ వెటికాడ్‌ అంటోంది. అంతేకాకుండా కేవలం గ్రాఫిక్స్‌ కాకుండా ఇంకేం లేదు. విజువల్స్‌, భారీ ఫైట్లు తప్ప ఈ చిత్రంలో ఆకట్టుకోవడానికి ఏం లేదు అని ‘బాహుబలి 2’ని చెత్తగా తేల్చింది. దాంతో ప్రభాస్‌ అభిమానులు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వెటికాడ్‌పై దారుణంగా ప్రచారం చేస్తున్నారు. దాంతో వెటికాడ్‌ తనపై ఈ అరాచకాలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. వెటికాడ్‌ పోస్ట్‌లు అంతర్జాతీయ మీడియా వరకు చేరాయి. దాంతో ప్రస్తుతం ఈ రివ్యూ వ్యవహారం అంతా రచ్చరచ్చగా మారింది.