అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ‘రారండోయ్ వేడుకచూద్దాం ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రం తర్వాత చైతూ చందూ మొండేటి దర్శకత్వంలో నటించనున్నాడు. చందూ మొండేటి ఇప్పటికే హిట్లతో దూసుకుపోతున్నాడు. చైతూ, చందూల కాంభోలో ఇప్పటికే ‘ప్రేమమ్’ చిత్రం వచ్చి మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. మరోసారి హిట్ కాంభో రిపీట్ అవుతుంటే అక్కినేని అభిమానులు ఖుషీగా ఉన్నారు.
చందూ మొండేటి కూడా చైతూ కోసం కథను సిద్దం చేశారు. ఇక అంతా పూర్తి అయ్యిందనుకున్న సమయంలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతనే లేరు. మొదటగా ఈ చిత్రాన్ని ఐ డ్రీం సంస్థ నిర్మించడానికి ఒకే చెప్పింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దాంతో ఈ చిత్రానికి నిర్మాత ఇంకా ఫిక్స్ కాలేదు. హిట్ కాంభో అయినా కూడా చైతూ మీద నమ్మకం లేకనో మరేంటో కానీ ఇప్పటి వరకు నిర్మాత ఇంకా ఖరారు కాలేదు. ఇకపోతే నాగార్జునకేమో ఇప్పటికే మూడు చిత్రాలు లైనులో ఉన్నాయి. దాంతో అన్నపూర్ణ బ్యానర్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టింది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత కోసం ఎదురుచూస్తున్నారు.