‘బాహుబలి 2’ ఒక చెత్త సినిమా… ప్రభాస్‌ ఒంటెలా ఉన్నాడు

ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి 2’ తాజాగా విడుదలైంది. ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా విడుదలయిన అన్ని భాషల్లో కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వరద పారిస్తోంది. ‘బాహుబలి 2’ను వీక్షించిన పలు భాషల సినీ ప్రముఖులు, విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. చాలా పాజిటివ్‌ రివ్యూలు వచ్చిన ఈ చిత్రానికి నెగిటివ్‌ రివ్యూలు రాకపోలేదు. పాపులారటి కోసం కొంతమంది ఈ చిత్రాన్ని చాలా చెత్తగా ఉందని రివ్యూలు రాశారు. బాలీవుడ్‌ రివ్యూ రచయిత కమల్‌ ఆర్‌ ఖాన్‌ ‘బాహుబలి 2’ చిత్రం చెత్తగా ఉందని, ఇది ఒక సినిమానా అంటూ ఘోరమైన రేటింగ్‌ ఇచ్చాడు. ఘన విజయాలను సాధించిన సినిమాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న కెఆర్‌కె రివ్యూ ప్రస్తుం హాట్‌ టాఫిక్‌గా మారింది.

రాజమౌళి దర్శకత్వం ఇంత చెత్తగా ఉంటుంది అనుకోలేదు, నటీనటులు దారుణంగా నటించారు, ఇక హీరో ప్రభాస్‌ అయితే ఒంటెలా ఉన్నాడు. గ్రాఫిక్స్‌ను చాలా చెత్తగా చూపించాడు. గ్రాఫిక్స్‌ను ఇంత చెత్తగా చూపిస్తాడా..?? ఈ చిత్రాన్ని డబ్బులు పెట్టి చూసే వారు మానసికంగా బాదపడుతారు. రెండో పార్టు కంటే మొదటి పార్టు కాస్త బెటర్‌గా ఉంది, ఈ చిత్రానికి 5కు కేవలం 1మాత్రమే రేటింగ్‌ ఇస్తాను అంటూ ‘బాహుబలి 2’కు చెత్త రేటింగ్‌ ఇచ్చాడు. కెఆర్‌కె రివ్యూ చూసిన ‘బాహుబలి 2’ అభిమానులు ఆయనపై పీకల్లోతు కోపంగా ఉన్నారు.