మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫ్లాపుల పరంపరలో బండి లాగిస్తుండగా ‘ధృవ’ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ‘తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన చెర్రీ ‘ధృవ’తో సక్సెస్ కొట్టాడు. దాంతో చెర్రీ మరో రీమేక్‌ను చేయాలని భావిస్తున్నాడు. ‘ధృవ’ చిత్రాన్ని నిర్మించిన అల్లు అరవింద్ ఈ రీమేక్‌ను కూడా నిర్మించనున్నాడని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. చెర్రీ చేయబోతున్న ఈ రీమేక్ కాస్త అనుమానంగా ఉంది. ఇప్పటి వరకు తెలుగు చిత్రాలు కన్నడలో రీమేక్ అయ్యి ఘన విజయం సాధించాయి. కానీ కన్నడ చిత్రాలు తొగులో రీమేక్ అయ్యి హిట్ అయిన ఆచూకి లేదు.
కన్నడ చిత్రాలు తొగులో రీమేక్ అయ్యి విజయం సాధించకపోయినా కూడా రామ్ చరణ్ కన్నడలో ‘బహదూర్’ చిత్రాన్ని రీమేక్ చేయాని భావిస్తున్నాడు. కన్నడలో విడుదలయ్యి మంచి విజయం సాధించిన ‘బహదూర్’ చిత్రాన్ని తెలుగులో సుక్కూ చిత్రం తర్వాత రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ‘బహదూర్’ చిత్రాన్ని కన్నడలో చూసిన పలువురు సినీ ప్రముఖులు మాత్రం రామ్‌చరణ్‌కు ఆ చిత్రం సూట్ కాదు, ఈ చిత్రంతో చెర్రీకి పరాజయం తప్పదు, చెర్రీ అది చేయకపోవడమే మంచిది అని హెచ్చరిస్తున్నారు. గతంలో చెర్రీ ‘ధృవ’ చిత్రం చేస్తున్నప్పుడు కూడా ఇవే హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో చెర్రీ వాటిని పట్టించుకోవడం లేదు. కానీ అభిమానులు మాత్రం కాస్త టెన్షన్‌గా ఉన్నారు.