ఓవర్సీస్‌లో రికార్డులను కొల్లగొడుతున్న ‘బాహుబలి 2’

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రంపై అంచనాలు కేవలం తెలుగు భాషలోనే కాకుండా విడుదలయిన అన్ని భాషల్లో ఏర్పడ్డాయి. ‘బాహుబలి 2’ విడుదలయిన అన్ని భాషల్లో కూడా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఇకపోతే తెలుగులో భారీగా వసూళ్లు రాబడుతుంది అని నమ్మకం ఉన్న ఈ చిత్రం అమెరికాలో విజయం సాధిస్తుందా అనే సందేహాలు ఉండేవి. కానీ ‘బాహుబలి 2’ మొదటి వారాంతపు కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయి. అమెరికాలో ఉన్న గత రికార్డులన్నీ కూడా బ్రేక్‌ చేస్తోంది. ఇంతకు ముందు ఉన్న భారీ రికార్డులన్నీ కూడా ‘బాహుబలి 2’ చిత్రం కొల్లగొడుతుంది.

ప్రీమియర్‌ షోలు, మొదటి వారాంతపు కలెక్షన్లు కలుపుకుని ఇప్పటికే 8.16మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన మొత్తానికి రాబట్టింది. కేవలం తెలుగు భాషలోనే అత్యధిక రికార్డులను నమోదు చేస్తుంది అనుకున్న ‘బాహుబలి 2’ చిత్రం అమెరికాలో కూడా ఘన విజయం సాధించింది. సినీ పరిశ్రమలో ఉన్న గత రికార్డులన్నీ బ్రేక్‌ చేస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం శాశ్వాతంగా నిలిచిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు.