ఏడాది క్రితం పీకల్లోతు ప్రేమలో ఉండడమే కాదు లోకం లో మాలాంటి ప్రేమికులు లేరు అన్నట్లు కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ లు తిరిగారు..పబ్ లు , సినిమా థియేటర్లు , బీచ్ లు ఇలా ఒకటనే కాదు చాలా చోట్ల ఈ జంట కనిపించరు..ఇక పెళ్లి ఒక్కటే మిగిలింది అని అంత అనుకుంటున్నా సమయం లో వీరిద్దరూ విడి పోయారు..ఏడాది గా మళ్లీ ఈ జంట ఒకటి గా కనిపించలేదు.
తాజాగా ఈ మాజీ ప్రేమ పక్షులు సెల్ఫీ దిగారు. ‘జగ్గా జస్సూస్’ అనే చిత్రంలో రణబీర్, కత్రినా కలసి నటించారు. అనురాగ్ బసు తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మాజీ ప్రేమికులిద్దరూ సెల్ఫీకి ఫోజులిచ్చారు. ఇక ఈ పోజులు చూసి సినీ ప్రేక్షకులు మళ్లీ వీరిద్దరూ కలిసారా..? ఇది సినిమా కోసమేనా లేక బయటకు కూడా ఇలాగే ఉంటారా..? అనే ప్రశ్నలు వేసుకుంటున్నారు.