ఏరియా వైజ్ బాహుబలి 2 ఫస్ట్ డే కలెక్షన్స్…

వెండి తెర ఫై హాలీవుడ్ రేంజ్ లో విజువల్ వండర్ ను తీసుకొచ్చినా రాజమౌళి కి దేశ వ్యాప్తంగా జయహో..రాజమౌళి అంటున్నారు..ఎక్కడ చూసిన ఏ నోటా విన్న సాహో..సాహో బాహుబలి అనేది తప్ప మరో మాట వినిపించడం లేదు..అంతలా ప్రేక్షకులను కట్టిపడేసింది బాహుబలి 2 ..

నిన్న (ఏప్రిల్ 28) ఉదయం ఆట తోనే అన్ని రికార్డ్స్ ను తూడ్చిపెట్టడం మొదలు పెట్టింది..ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి మేనియా మాటల్లో చెప్పలేం..ఫస్ట్ డే ఏ చిత్రం కూడా బాహుబలి దరిదాపుల్లో కూడా చేరుకోలేని విధంగా వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో రూ. 40 కోట్లు సాధించినట్లు ట్రెండ్ వర్గాలు చెపుతున్నారు..

సంక్రాంతి కి వచ్చిన ఖైదీనంబ‌ర్ 150 సాధించిన డే-1 రికార్డును బాహుబ‌లి-2 తుడిచేసింది.

* నైజాం-10 కోట్లు
* సీడెడ్‌-8 కోట్లు
* ఏపీ లో – 30 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలలో 50 కోట్లు
*క‌ర్నాట‌క – 10 కోట్లు
ఇక కేర‌ళ‌, త‌మిళ‌నాడులోనూ అసాధార‌ణ రికార్డులు అందుకుంది.