బాహుబలి2.. డే1@ రూ100 కోట్లు

దర్శక ధీరుడు రాజమౌళి దృశ్య కావ్యం ‘బాహుబలి ది బిగినింగ్‌’ ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కనులకింపుగా ఉందని, తెలుగు సినిమా చరిత్రగతిని మార్చిన సినిమాగా, భారతీయ సినిమా స్థాయిని పెంచిన సినిమాగా బాహుబలిని అభివర్ణిస్తున్నారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పుడీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. దాదాపు 9000 థియేటర్లలో ప్రదర్శిస్తున్న బాహుబలి తొలిరోజున అన్ని భాషల్లో కలిపి దేశవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసిన నట్లు సినీ విశ్లేషకులు అంచనా కడుతున్నారు. ఇదే నిజమైతే ఇండియన్ సినిమా బాహుబలిది సరికొత్త రికార్డు గా నిలుస్తుంది.