అభిమానులకు మాంచి బాహుమతి ప్లాన్‌ చేస్తున్న మహేష్‌

mahesh-spyder-3సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం క్రేజీ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. రెండు పాటలు, క్లైమాక్స్‌ సన్నివేశాలు మినహా షూటింగ్‌ అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతం కొన్ని సీన్లను రిషూట్‌ చేస్తున్నారు. కాగా షూటింగ్‌ అనుకున్న సమయానికి పూర్తి కావడం కష్టం అయ్యింది. ఈ చిత్రాన్ని మొదటగా జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. రిషూట్‌ వల్ల ‘స్పైడర్‌’ను ముందుగా అనుకున్న సమయానికి విడుదల చేయడం కష్టమే అని తేలిపోయింది. ఫస్ట్‌లుక్‌ విషయమై చాలా ఆలస్యం చేసిన యూనిట్‌ విడుదల తేదీని వాయిదా వేయడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అభిమానులను ఎలాగైనా కూల్‌ చేయాలనే ఉద్దేశ్యంతో మహేష్‌ అభిమానులకు మంచి బాహుమతి ప్లాన్‌ చేస్తున్నాడు. అగష్టు 9న మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మహేష్‌ భావిస్తున్నాడు. ఇలాగైనా అభిమానులను కాస్త ఖుషీ చేయొచ్చు, అందుకే అగష్టు 9ననే ‘స్పైడర్‌’ను విడుదల చేయాలి అని చిత్ర యూనిట్‌కు సూచించాడట, అందుకు యూనిట్‌ సభ్యులు కూడా ఒకే అనడంతో షూటింగ్‌ను చకాచకా పూర్తి చేసి ఈ సారి అనుకున్న సమయానికి విడుదల చేయాని గట్టిగా ప్లాన్‌ చేస్తున్నారు. క్లైమాక్స్‌ నన్నివేశాలను వచ్చే నెల 2 నుండి హైద్రాబాద్‌లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ నటిస్తోంది.