బాహుబలి కి తాకిన కులగజ్జి..?

Baahubali2-theaters
ఎన్నికల ప్రచారం లోనే కాదు ఇప్పుడు సినిమా టికెట్స్ విషయం లో కూడా కులగజ్జి తాకిందనే వార్తలు వినిపిస్తున్నాయి..యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ మూవీ కోసం రెండేళ్ల గా ఎద్దురుచుస్తున్న సంగతి తెల్సిందే..ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో ను చూడాలని జనాలంతా టికెట్స్ కోసం పరుగులు పెడుతున్నారు..అయితే ఓ హీరో అభిమానులు మాత్రం టికెట్స్ విషయం లో కులగజ్జి చూపిస్తున్నారని వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు..

Baahubali-ts
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో బాహుబలి 2 కు సంబదించిన టికెట్స్ ను భారీ రేటుకు అమ్ముతున్నారట.. మా కులానికి చెందిన హీరో టికెట్ భారీ రేటుకి అమ్మాలని బ్లాక్ ఒక్కో టికెట్ ని (బెనిఫిట్ షో) రూ. 3000లకి అమ్ముతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 300 నుంచి 600 వరకు పలుకుతుంటాయి. ఇప్పుడు కులగజ్జి బాహుబలి టికెట్ రేట్లని అమాంతం పెంచేసిందని మిగతా వారు వాపోతున్నారు.. ఇక తెలంగాణ లో మాత్రం బెనిఫిట్ షోస్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది..కాకపోతే అన్ని థియేటర్స్ లలో ఉదయం 8 గంటలకే మొదటి ఆట వేయడం జరుగుతుంది. రోజుకు ఐదు షోస్ వేయాలని ప్రభుత్వం ఆమోదం తెలిపింది.