డిసెంబర్ 21న ‘సారొస్తారు’

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా ఎన్నో గోల్డెన్ జూబ్లీహిట్స్ అందించిన ‘వైజయంతి’ సంస్థ సమర్పణలో, తీ ఏంజెల్స్ స్టూడియో ప్రై లిమిటెడ్ పతాకంపై ‘యువత, సోలో’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన పరశురామ్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్, వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకదత్ నిర్మిస్తున్న ‘సారొచ్చారు’ మంచి ప్రేమకథతో..నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ – “రవితేజ హీరోగా చేస్తున్న మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సారొచ్చారు’ టైటిల్ కి ట్యాగ్ లైన్ గా ‘మంచి ప్రేమకథతో..’ పెట్టాం. రవితేజ బాడీలాంగ్వేజ్ కి తగినట్టుగా వుంటూనే కొంచెం డిఫరెంట్ స్టైల్ లో అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు. నిర్మాత ప్రియాంకదత్ మాట్లాడుతూ “రవితేజ-పరశురామ్ కాంబినేషన్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘సారొచ్చారు’ రూపొందుతుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు. రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ, జయసుధ, చంద్రమోహన్, రవిప్రకాష్, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్న ఈ భారీ చిత్రానికి సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, ఫొటోగ్రఫీ : విజయ్ కె.చక్రవర్తి, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కో-డైరెక్టర్స్ : కిరణ్, బుజ్జి, ప్రొడక్షన్ కంట్రోలర్ : వి. మోహనరావు