నిజామా..రిలీజ్ కు ముందే బాహుబలి 2 ఆన్లైన్ లో దర్శనం ఇవ్వబోతుందా..?

Baahubali2-theatersసినిమా ఇండస్ట్రీ లో పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే అందరిలో టెన్షనే..ఇక నిర్మాతలకైతే రెండు టెన్షన్లు..ఒకటి సినిమా రిలీజ్ అయితే మరోటి పైరసీ భూతం..ఈ మధ్య ఇంటర్ నెట్ పుణ్యమా అని సినిమా అంట మొదటి ఆట తర్వాత ఇంటర్ నెట్ లో ప్రత్యేక్షం అవుతుంది..అలాగే రిలీజ్ కు ముందే సినిమా లీకేజ్ కావడం కూడా ఎక్కువయ్యింది..అత్తారింటికి దారేది సినిమా విషయం లో అలాగే జరుగగా..ఇప్పుడు బాహుబలి 2 కు కూడా అలాగే జరిగిందనే గాసిప్స్ బయటకు వస్తున్నాయి..

సినిమా పైరసీ వెర్షన్‌ ఇంటర్నెట్‌లో విడుదలకు ముందే అందుబాటులో వుండబోతోందన్న ప్రచారం చిత్ర నిర్మాతల్లో టెన్షన్‌ పెంచేస్తోంది. ‘ఇదిగో, ఇదే సాక్ష్యం..’ అంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి టైటిల్‌, దాంతోపాటుగా ప్రభాస్‌ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడం గమనార్హం. ఇక ఇండస్ట్రీ లో సినిమా ఇప్పటికే ప్రదర్శితమయ్యిందనే వారూ లేకపోలేదు.

Baahubali-Tickets-Mosam

ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ట్రైలర్‌లోంచి కట్‌ చేసి, ఆ ఫొటోల్ని పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ‘బాహుబలి ది కంక్లూజన్‌’కి సంబంధించి గతంలో లీకేజీ వివాదం తెరపైకొచ్చింది. సకాలంలో చిత్ర యూనిట్‌ స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకోండి. మరిప్పుడు, ‘బాహుబలి ది కంక్లూజన్‌’ లీకేజీల దెబ్బకి బలైపోకుండా, పైరసీకి గురికాకుండా ప్రేక్షకుల ముందుకొస్తుందా.? అనేది చూడాలి.