తెలుగును కూడా వదలనంటోన్న సీనియర్‌ హీరోయిన్‌

gauthami bjpతెలుగు, తమిళ, మళయాల భాషల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ హీరోయిన్‌ గౌతమి తెలుగులో రీ ఎంట్రీకి సిద్దమవుతోంది. ఈ అమ్మడు ఇప్పటికే రెండు మళయాల చిత్రాలలో నటించడానికి ఒకే చెప్పింది. తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించడానికి చర్చలు జరుపుతోంది. ఇక తెలుగులో కూడా తన వయస్సుకు తగిన పాత్రలు వస్తే చేయడానికి సిద్దంగా ఉన్నట్టు సందేశాలను పంపుతోంది. ఇటీవల అమ్మ, అత్త పాత్రలకు కూడా మంచి గిరాకి ఉన్నది కాబట్టి సీనియర్‌ హీరోయిన్‌లను తీసుకోవడానికే దర్శక నిర్మాతలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

గౌతమికి తగిన పాత్రలు తెలుగులో చాలానే ఉంటాయి. గౌతమి నటిస్తే ఆ సినిమాకు చాలా హైప్‌ వస్తుంది కాబట్టి తెలుగులో కూడా ఈ అమ్మడికి ఇప్పటికి అవకాశాలకు కొదువేం ఉండదు, ఈమె ఒప్పుకోవాలి కానీ అవకాశాలు చకాచకా వస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనారోగ్యం, పెళ్లి, కమల్‌తో సహజీవనం అన్నీ కూడా గౌతమిని తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో గౌతమి మళ్లీ వెండి తెర మీదకు వచ్చి కొంత ఉపశమనం పొందాలనుకుంటుంది. పూర్తి స్థాయిలో సినిమాలు చేయడానికి సిద్దమయిన గౌతమి అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా నటించడానికి చాలా ఆసక్తిని కనబర్చుతుంది.