కేక పుట్టిస్తున్న మహేష్ బాబు స్టిల్స్

mahesh-spyder-1

మొన్నటి వరకు మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ మూవీకి సంబంధించి ఏ ప్రకటన కానీ స్టిల్స్ కానీ బయటకు రాకపోయేసరికి అంత నిరాశ చెందారు..కానీ తాజాగా ఈ చిత్రానికి సంబదించిన ఒక్కో స్టిల్ బయటకు వస్తుంటే మహేష్ అభిమానుల ఆనందాలు అన్ని ఇన్ని కావు..మునుపెన్నడూ లేని విధంగా మహేష్ ఈ మూవీ లో కనిపిస్తున్నాడని..మహేష్ లుక్ ఫై డైరెక్టర్ ఎంతో శ్రద్ద పెట్టాడని అభిమానులు కామెంట్స్ వేస్తున్నారు. ఇటీవల బయటకు వచ్చిన మురగదాస్ , రకుల్ , మహేష్ ముగ్గురు కలిపి ఉన్న వర్కింగ్ స్టిల్ , సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

mahesh-spyder-2

mahesh-spyder-3

ముందుగా ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా జూన్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ప్పుడా డేట్ మారినట్టు సమాచారమ్. స్పైడర్ మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఏప్రిల్ నెలాఖరికల్లా ‘స్పైడర్’ షూటింగ్ పూర్తికావాల్సింది. అయితే, అది మే రెండో వారం వరకు పొడిగించారు. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం తగినంత సమయం లేకపోవడంతో.. ముందుగా ప్రకటించిన జూన్ 23న రావడం కష్టమని స్పైడర్ ని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.