వర్మ కన్ను దానిపై పడింది

rgv (6)

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్ను ఇప్పుడు అవార్డుల పై పడింది. సమాజంలో జరిగే పరిణామాలకు తనదైన శైలిలో సెటైర్లు వేసే వర్మ ఇప్పుడు 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల పై ట్వీట్లు సంధించాడు. ఈ వార్డుల విషయంలో జ్యూరీ సభ్యులు కొందరి విషయంలో పక్షపాతంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై జ్యూరీ మెంబర్స్ కమిటీ హెడ్ ప్రియదర్శన్ మండిపడగా, దానికి కౌంటర్ గా మరో ట్వీట్ చేశాడు మురుగదాస్.

అయితే ఇప్పుడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అగ్గికి ఆజ్యం పోసినట్టు అయింది. అవార్డులు ఎంపికను పరోక్షంగా విమర్శిస్తూ వర్మ చేసిన ట్వీట్స్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ” అమీర్ ఖాన్ ఇండియాలోనే గొప్ప ఫిలిం మేకర్. ఆయనకి అవార్డులు రాకపోతే ఆయన స్థాయి ఏం తగ్గదు. చాలా క్వాలిటీ ఉన్న సినిమాలు చేశాడు అమీర్. అయినప్పటికి ఆయనకి అవార్డులు రాకపోవడం దురదృష్టకరం అంటూ మళ్ళీ మంటరేపాడు వర్మ.