చిట్టిబాబుగా రామ్ చరణ్

charan look

రామ్ చరణ్ సుకుమార్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఏప్రిల్‌ 1నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైయింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. పల్లెటూరి నేపధ్యంలో సాగే కధ ఇది. . విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం ‘రేపల్లె’.. ‘పల్లెటూరి మొనగాడు’ ‘మొగల్తూరు మొనగాడు’ అనే పేర్లు పరిశీలనలో వున్నాయి.

ఈ చిత్రంలో చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. అన్నట్టు ఇందులో రామ్ చరణ్ పాత్ర పేరు కూడా వెరైటీగా పెట్టారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పేరు ‘చిట్టిబాబు’ అని తెలిసింది. ఇనుడ్లో సమంత ఇందులో కథానాయిక. చరణ్ తో సమంత జతకట్టడం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.