పవన్‌ను కలవడానికి వెళ్లిన రాశిని సిబ్బంది ఇలా చేశారా

rashiపవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఒకవైపు సినిమాలు, మరోవైపు కుటుంబం, పిల్లలు ఇంకో వైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉంటున్నారు. ఈయనను కలవడానికి సొంత మనుషులు సైతం అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సి వస్తుందట. పవన్‌ గతంలో హీరోయిన్‌ రాశితో కలిసి ‘గోకులంలో సీత’ చిత్రంలో నటించారు. ఆ సాన్నిహిత్యంతో రాశి తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా పాపను తీసుకుని పవన్‌ను కలవడానికి వెళ్లిందట. పవన్‌తో తనకున్న స్నేహం వల్ల రాశి అపాయింట్‌మెంట్‌ తీసుకోకుండా పవన్‌ నివాసానికి వెళ్లిందట.

అపాయింట్‌మెంట్‌ లేని కారణంగా పవన్‌ సిబ్బంది రాశిని చాలాసేపు బయటే వెయిట్‌ చేయించారట. పవన్‌ను కలవడానికి కూతురుతో సహా వెళ్లిన రాశి బయటే చాలాసేపు కూర్చుందట. రాశి బయట ఉన్నట్టు పవన్‌కు తెలియకపోవడంతో ఇలా జరిగింది. అనంతరం పవన్‌కు రాశి వచ్చింది అని తెలియగానే వెంటనే లోపలికి పిలిపించాడట. చాలాసేపు పవన్‌, రాశిలు మాట్లాడుకున్నారట. ఎక్కువ సేపు పిల్లల గురించే మాట్లాడుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా రాశినే చెప్పుకొచ్చింది. నిజానికి ‘గోకులంలో సీత’ సమయంలో కంటే తాను ఇప్పుడే పవన్‌తో ఎక్కువ మాట్లాడాను అని రాశి అంటోంది.