బాలీవుడ్ ‘హంటర్’ చిత్రానికి తెలుగులో రీమేక్‌గా ‘బాబు బాగా బిజీ’ చిత్రం తెరకెక్కింది. అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించగా తూజస్వి మడివాడ, శ్రీముఖి, మిస్తీ చక్రవర్తిలు హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్లు చాలా బూతులుగా ఉన్నాయి. సినిమా మొత్తం మీద బూతులు బాగానే ఉన్నట్టు ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఒక్కొరి పాత్రపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి.
కానీ ఈ చిత్రంలో నటించిన నటీనటులు మాత్రం తాము చాలా పద్దతిగా నటించాం అని చెబుతున్నారు. ఇటీవలె యాంకర్ శ్రీముఖి ఈ చిత్రంలో తనది పద్దతైన పాత్ర అని, హీరోని మార్చే మంచి కేరెక్టర్ అని చెప్పింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన మిస్తీ చక్రవర్తి ఈ చిత్రంలో తన పాత్ర చాలా బాగుంటుందని, పరిణితి చెందిన అమ్మాయిలాగా తన పాత్ర ఉంటుందని తన పాత్రని దర్శకుడు చాలా చక్కగా రూపొందించాడు అని చెబుతోంది. ఇద్దరు హీరోయిన్లు కూడా పద్దతిగా నటించాం అని చెబితే ఈ అడల్ట్ కంటెంట్ చిత్రం ఎలా తెరకెక్కించారు. మరీ ఈ చిత్రంలో బూతులు ఎవరు చేశారు, బూతులు లేకుంటే పెద్దలకు మాత్రమే ‘బాబు బాగా బిజీ’ రిపోర్ట్ ఎలా వచ్చింది అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అంతా పద్దతిగా నటిస్తే బూతులు ఎవరు చేశారు, మొదట్లో అంతా ఇలాగే అంటారు తెరపై చూస్తే అందాల మోతకు హద్దే ఉండదు అని కొందరి అభిప్రాయం.