డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాస్ కథాంశాలతో తెరకెక్కించి చాలా సక్సెస్‌లనే మూటగట్టుకున్నాడు. కానీ చాలావరకు పూరీ చిత్రాలు ఫ్లాపవుతున్నాయి. వరుస ఫ్లాపులతో ఉన్న పూరీకి ఇక ఏ స్టార్ హీరో అవకాశాలు ఇవ్వరు అని అనుకున్నారు. కానీ వంద చిత్రాలు పూర్తయిన బాలయ్యబాబు సక్సెస్ తీపిని రుచి చూసి 101వ చిత్రాన్ని పూరీకి అప్పగించాడు. ఫ్లాపులతో బండి లాగిస్తున్న పూరీకి బాలయ్య అవకాశం ఎందుకిచ్చాడు ఈ చిత్రాన్ని కూడా పూరీ ఓవర్ చేసి ఏం చేస్తాడో అని అభిమానులు అనుకున్నారు. ఆ తర్వాత బాలయ్యబాబు కథ నచ్చడం వల్లనే పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చా, చాలా మంచి కథను చెప్పాడు అనడంతో అభిమానులు కాస్త కుదుట పడ్డారు.
దర్శకుడు పూరీ తాజాగా బాలయ్య బాబును తెగ పొగిడేస్తున్నాడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలనుకున్నాడో ఏమో కానీ పూరీ తాజాగా బాలయ్యను ప్రశంసలతో ముంచేశాడు. షూటింగ్ ఉదయం ఏడు గంటలకు ప్లాన్ చేస్తే బాలయ్య 6.30 వరకే సెట్లో ఉంటాడని, ఆయన సమయ పాలన ఆశ్చర్యం కలిగిస్తుందని, నా టేకింగ్ స్టయిల్‌ను ఆయన ఎంజాయ్ చేస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది అని, తాను చెప్పిన దానికంటే చాలా మెరుగ్గా చేస్తున్నాడు అని బాలయ్యను పూరీ తెగ పొగిడేశాడు. తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్‌తో చేయాలని ఉందని, అది కూడా వర్కౌట్ అవుతుందని పూరీ చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ క్రేజ్‌ను అమాంతం పెంచేలా ఆ చిత్రం ప్లాన్ చేస్తాను అని కూడా పూరీ చెప్పుకొచ్చాడు.