సంపూ మరీ ఇంత మోసమా….?? అబద్దాలతో నమ్మించేసావు

Actor-Sampoornesh-Babu‘హృదయ కాలేయం’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు సంపూర్నేష్‌బాబు. మొదటి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సంపూకు ఆ తర్వాత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా పెరిగిపోయింది. అనంతరం పలు చిత్రాల్లో నటించిన సంపూ బర్నింగ్‌ స్టార్‌గా మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. సంపూ కేరక్టర్‌లో పిచ్చ కామెడీ ఉండి అది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా సహకరించినందు వల్లనే సంపూ ఇంత పాపులర్‌ అయ్యాడు. అసలు ఈ సంపూ ఎవరు..?? ఈయన ఎక్కడి నుండి వచ్చాడు అని ప్రేక్షకులు ఆరా తీయడం మొదలెట్టాడు. అప్పట్లో సంపూ తాను ఎన్నారైని అని, మంచి ఉద్యోగం కూడా ఉంది, బాగా సంపాదించుకుని సినిమాల మీద మోజుతో ఇక్కడకు వచ్చానని చెప్పుకొచ్చాడు.

తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న సంపూ తన గురించి నిజం చెప్పాడు. అసలు సంపూ ఎన్నారై కానే కాదట. తన అసలు పేరు నరసింహాచారి అని, సిద్దిపేటలో బంగారం షాపు నడిపేవాడిని అని చెప్పాడు. తన గురించి అబద్దం చెప్పినందుకు సారీ కూడా చెప్పాడు. దాంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఏంటి సంపూ మరీ ఇంత మోసమా..? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నారైని అని కథలు చెప్పి అందరిని బాగా నమ్మించేశావుగా అని కొంతమంది సంపూపై ఫైర్‌ అవుతున్నారు. మంది సంపూ ఎన్నారూ అయితే ఏంటి లోకల్‌ అయితే ఏంటి టాలెంట్‌ ఉండాలి కాని మరికొందరి వాదన.