తెలుగులోనే సత్తా లేదు మరీ బాలీవుడ్‌లో ఎలా..??

varunమెగాస్టార్‌ చిరంజీవి సినీ పరిశ్రమలోకి వచ్చి తన కుటుంబాన్ని అంతా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు. చిరుతో పాటు ఆయన సోదరులు, పుత్రులు, అల్లుల్లు ఇలా మెగా వారసులు చాలామంది సినీ పరిశ్రమలో స్థిరపడుతున్నారు. మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ తొలి చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. తర్వాత రెండో సినిమా కూడా వరుణ్‌ తేజ్‌కు మంచి టాక్‌నే తీసుకువచ్చింది. అనంతరం విడుదలయిన ‘లోఫర్‌’, ‘మిస్టర్‌’ చిత్రాలే వరుణ్‌కు ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఈ చిత్రాత వల్ల ఉన్న కాస్త పేరు కూడా పోయేలా ఉంది. అందుకే తదుపరి చిత్రాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు.

తొలి చిత్రం ‘ఘాజీ’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సంకల్ప్‌ రెడ్డితో వరుణ్‌ త్వరలో జత కట్టనున్నాడు. ‘ఘాజీ’ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి హిట్‌ అయ్యింది. దాంతో దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడు. వరుణ్‌ తేజ్‌ తగ్గ కథను సిద్దం చేసి సంకల్ప్‌ రెడ్డి మరో మంచి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కాగా ఈ కాంభో హిందీలో కూడా విడుదల చేసే విధంగా తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారు. వరుణ్‌ తేజ్‌కు ప్రస్తుతం పరిస్థితుల్లో తెలుగులో హిట్‌ రావడమే కష్టం అలాంటి బాలీవుడ్‌లో అంత సత్తా ఉందా అనే సందేహాలు వెలువెత్తుతున్నాయి.