ఇండియాటుడే లో బాహుబలి

baahubai

బాహుబలి 2కి కౌంట్ డౌన్ మొదలైయింది. మరో వారంరోజుల్లో బాహుబలి బొమ్మ పడిపోతుంది. హుబలి కొనసాగింపుగా ఇప్పుడు బాహుబలి: ద కన్‌క్లూజన్‌ చూపించబోతున్నారు రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించిన ‘బాహుబలి’కి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి 2పై కూడా భారీ అంచనాలు వున్నాయి. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం..
వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

ఈ అంచనాలకు తగ్గట్టు ప్రమోషన్ కూడా భారీగా చేస్తున్నారు. తాజాగా ఇండియాటుడే మేగజైన్.. తాజా ఎడిషన్ కవర్ పేజ్ పై బాహుబలి కనిపించింది. బాహుబలి ప్రభాస్ ఏనుగు మీదకు తొండంపై నుంచి ఎక్కుతున్న పోస్టర్ ను కవర్ పేజ్ పై వేశారు. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన బాహుబలి ఇప్పుడు స్పెషల్ కవరేజ్ లో కనిపించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 28న ‘బాహుబలి-2’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.