కేటీఆర్ కు యువకుడు సలహా..ఏమనో తెలుసా..?

KTR-Hair

తెలంగాణ ఐటీ మంత్రి గా కేటీఆర్ ప్రస్తుతం కుమ్మేస్తున్నాడు..అన్ని శాఖల ఫై ఓ కన్నేస్తూ..ఎక్కడ అన్యాయం జరిగిన..వెంటనే స్పందిస్తూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడు..అటువంటి యాంగ్ డైనమిక్ నాయకుడికి ఓ యువకుడు సోషల్ మీడియాలో సలహా ఇచ్చి ఆశ్చర్య పరిస్తే..దానికి కేటీఆర్ సమాధానం చెప్పడం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది…ఇంతకీ ఆ యువకుడు ఏం సలహా ఇచ్చాడు..దానికి కేటీఆర్ ఏం సమాధానం చెప్పాడో మీరే చూడండి.

KTR-Tweet

KTR-Tweet2

ఇటీవలే కేటీఆర్ పాతబస్తీలో విస్తృతంగా పర్యటించి, మొఘల్ పురలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇతర నేతలతో క్రికెట్, బాస్కెట్ బాల్ కూడా ఆడారు. కేటీఆర్ క్రికెట్ ఆడుతున్న ఫొటోపై ఎంఎన్ ప్రపుల్లాకుమార్ అనే యువకుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘సర్, ఈ మధ్య మీ జుట్టు నెరిసినట్టుంది. మంత్రులందరిలో మీరే యువకులు. మీ జుట్టుకు రంగు వేసుకోండి’ అని కామెంట్ చేసి మంత్రికి ట్యాగ్ చేశారు. దీంతో కేటీఆర్ కూడా ప్రపుల్లా కుమార్ ట్వీట్ కు సరదాగా రీ ట్వీట్ చేశారు.‘నేను అంత యంగ్ ఏమీ కాదనుకుంటున్నాను’ అంటూ కేటీఆర్ చేసిన రీ ట్వీట్ చేసి ఆశ్చర్య పరిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ట్వీట్ గురించే మాట్లాడుకుంటున్నారు.