సమంత విషయంలో సీరియస్ అయిన కేటీఆర్

samntha

తెలంగాణ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంతని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆమెకు ఓ చీరను కూడా బహూకరించారు. సమంత కూడా ప్రచారంలోకి దిగింది. అయితే సమాచార హక్కు చట్టం ఓ షాకింగ్ విషయం బయటికివచ్చింది. తెలంగాణ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్ గా సమంత పేరు ఆ చట్టంలో లేదు. దీంతో మళ్ళీ కేటీఆర్ సీరియస్ గా స్పదించి అధికారులను ఎలర్ట్ చేశారు.

దీంతో రాష్ట్ర చేనేత సహకార సంస్థ ఎండీ శైలజారామయ్యర్‌ ను ఓ ప్రకటన వచ్చింది. తెలంగాణ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంత సేవలను వినియోగించుకుంటున్నామని చెప్పారు. ఆమె చేనేత అంబాసిడర్ కాదని జరుగుతున్నా ప్రచారం అవాస్తవమన్నారు. త్వరలోనే అధికారికంగా సమంతతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పిచేందుకు సమంత స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, ఆమె అభినందనలు చెబుతూ ఓ ప్రకటన రావడంతో గందరగోళానికి తెరపడింది.