విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. జామి మండలం బలరాంపురంకు చెందిన ఒక వివాహిత స్నానం చేస్తుండగా శ్రీనివాస్ అనే కామాంధుడు సెల్ కెమెరాతో చిత్రీకరించాడు. రెండు మూడు సార్లు ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తన కోరిక తీర్చకుండా ఆ దృశ్యాలను యూట్యూబ్‌లో పెట్టి ఊరు వాళ్లందరికి కూడా వాట్సప్‌లో పంపిస్తాను అంటూ బెదిరించాడు. దాంతో ఆమె అతడికి తలొగ్గక తప్పలేదు.
ఒకటి కాదు రెండు కాదు దాదాపు 11 నెలల పాటు ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా రేప్ చేస్తూ ఉన్నాడు. ఇటీవల తన స్నేహితుడి కోర్కెను కూడా తీర్చాలంటూ శ్రీనివాస్ బలవంతం చేయడంతో ఇక వేదింపులు భరించలేక పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలంటూ మహిళ సంఘాల వారు ఆందోళనలు చేస్తున్నారు.