‘స్పైడర్‌’కు రెండు క్లైమాక్స్‌లు ఎందుకంటే..??

maheshసూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం క్రేజీ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించే ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. రెండు పాటలు, క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ అంతా పూర్తి అయ్యింది. జూన్‌ 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం రెండు క్లైమాక్స్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు తగ్గట్టు ఎక్కడా కూడా లోపం జరగకుండా అభిమానులను తృప్తి పరచాలని దర్శకుడు మురుగదాస్‌ క్లైమాక్స్‌ సన్నివేశాల పట్ల చాలా జాగ్రత్త వహిస్తున్నాడు.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వెర్షన్‌లో సూపర్‌స్టార్‌ అభిమానుల అంచనాల స్థాయికి తగ్గట్టు క్లైమాక్స్‌ను భారీగా ఏర్పాటు చేస్తున్నారట. మహేష్‌ తమిళ ప్రేక్షకులకు కాస్త కొత్త, అతిగా చేస్తే తమిళులకు నచ్చదు కాబట్టి తమిళ వెర్షన్‌కు చాలా సింపుల్‌గా ఉండే క్లైమాక్స్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇలా తెలుగు, తమిళ భాషల్లో ‘స్పైడర్‌’ చిత్రానికి రెండు క్లైమాక్స్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.