హెబ్బా ఈసారి ఏం చేస్తుంది.

Angel-firstlook

‘కుమారి 21 ఎఫ్, ఇదో రకం ఆడో రకం , ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుని లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ చేస్తున్న సినిమాల్లో ‘ఏంజెల్’ కూడా ఒకటి. ఫిబ్రవరి నెలాఖరులో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క టీజర్ రేపే విడుదలకానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మాత్రమే గాక సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కడం జరిగింది.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా సినిమా పట్ల ఆత్రుత మొదలైంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇప్పటికే సంగీత దర్శకుడు భీమ్స్ అన్ని పాటలను పూర్తి చేసేశాడు. సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై ముప్పా వెంకయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాహుబలి పళని డైరెక్ట్ చేస్తున్నారు.

angel-movie

హెబ్బా పటేల్ నటించిన మిస్టర్ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుంది. మరోవైపు రాజ్ తరుణ్ తో ‘అందగాడు’ సినిమాలో నటిస్తోంది.