మెగాస్టార్ హీరోగా నటించిన ‘ఖైదీనెం.150’ చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు వి వి వినాయక్ తాజాగా ‘బాహుబలి’ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతకొంత కాలంగా ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళికి వినాయక్‌కు కోల్డ్ వార్ జరుగుతుంది. వినాయక్ చిత్రీకరించిన అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని నటించిన ‘అఖిల్’ చిత్రం వల్ల రాజమౌళి, వినాయక్‌ల మధ్య విభేదాలు వచ్చాయనే టాక్ ఎప్పటి నుండో ఉన్నది కానీ ఈ విషయమై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అలాగని అప్పటి నుండి వినాయక్, రాజమౌళిలు కూడా సన్నిహితంగా కనిపించిన సందర్భం లేదు.
తాజాగా మీడియాతో ముచ్చటించిన ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంపై చిరు దర్శకుడు వినాయక్ ఘాటుగా స్పందించాడు అని చెబుతున్నాడు. మొదటి పార్టు విడుదలయిన నేపథ్యంలో వినాయక్ రాజమౌళి, ప్రభాస్‌లతో ఇన్ని ప్రశ్నలకు నెలువైన ఈ చిత్రం ఎలా హిట్ అయ్యింది అంటూ షాకింగ్‌గా మాట్లాడాడు. అసలు క్లారిటీ లేని ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది, కన్‌క్లూజన్ లేని చిత్రంను ప్రేక్షకులు ఎలా ఇష్టపడ్డారు అంటూ ‘బాహుబలి’ చిత్రంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని వినాయక్ సరదాగా అన్నాడట. చాలామంది కూడా ఈ చిత్రంపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఆ ప్రశ్నలన్నిటికి కూడా పది రోజుల్లో సమాధానం దొరకబోతుంది అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఈనెల 28న ‘బాహుబలి 2’ విడుదల కాబోతుంది.