‘బాహుబలి 2’ సెన్సార్‌ టాక్‌

bahubali-hindi-poster-newటాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రంకు తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయినట్టు టాక్‌ వినిపిస్తోంది. చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఈ విషయమై అధికారిక సమాచారం లేదు. కానీ ఏప్రిల్‌ 17న ఈ చిత్ర తెలుగు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ ఎ సర్టిఫికెట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’ టీమ్‌ ఈ విషయాన్ని ఎందుకు గుట్టుగా ఉంచుతున్నారంటే ఇతర భాషల్లోని సెన్సార్‌ రిపోర్ట్‌ వచ్చాక ఒకేసారి గ్రాండ్‌గా అన్ని భాషల సెన్సార్‌ టాక్‌ను అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్ర మొదటి పార్టు విడుదలయ్యి ఇప్పటికే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. పలు భాషల్లో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అయితే రెండవ పార్టు మొదటి పార్టు కంటే చాలా బాగుందని, 250 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం కేవం తెలుగులోనే కాదు దేశంలోని సినీ పరిశ్రమలోనే ఎన్నో సంచలనాలు సృష్టింబోతుందని సెన్సార్‌ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్కలు జంటగా నటించగా రానా, తమన్నాలు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాలు నుండి అభిమానులతో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.