23 న పవన్ సినిమా ముహూర్తం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.వి.ఎస్. ప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఈ నెల 23వ తేదిన ప్రారంభం కానున్నది. చాలాకాలం తరువాత వస్తున్న ఈ సూపర్ హిట్ కాంబినేషన్ పట్ల ఇటు సినిమా పరిశ్రమలోనూ, అటు పవన్ అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. పూర్తి కుటుంబ కథా నేపధ్యంలో వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం తప్పని సరిగా విజయవంతమవుతుందని నిర్మాత ధీమాగా చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన సమంత హిరోయిన్ గా నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల మొదలవుతుందని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకు ‘ హరే రామ ..హరే కృష్ణ ‘ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.