టీజర్ టాక్ : విక్రమ్ ‘ధృవ నక్షత్రం’

Dhruva-Nakshtramవరుస ప్లాప్స్ తో ఇబ్బందుల్లో ఉన్న విక్రమ్..ఇప్పుడు ఆశలన్నీ గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ‘ధృవ నక్షత్రం’ ఫైనే పెట్టున్నాడు. ఈ మూవీ మొదలైనప్పుడే ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్..తాజాగా ఈరోజు విక్రమ్ పుట్టిన రోజు సందర్భాంగా మరో టీజర్ ను రిలీజ్ చేసి అభిమానులకు సంతోషాలు నింపారు.

ఫస్ట్ టీజర్ లో ఒక టెర్రరిస్ట్ నాయకుడికి.. సీక్రెట్ ఏజెంట్ అయిన విక్రమ్ కు మధ్య సాగే సంభాషణ ఉంటుంది. హీరో సహచరుడిని బందీగా తీసుకున్న విలన్.. హీరోను తన దగ్గరికి రమ్మని బెదిరిస్తుంటాడు. ఆ టీజర్ నేపథ్యమంతా ఫారిన్లో ఉంటుంది. తాజా టీజర్ లో హీరో ఢిల్లీలో అడుగుపెట్టే క్రమంలో విలన్ తో సాగించే సంభాషణను ఇందులో చూపించారు. ఈ టీజర్ లో కూడా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు విక్రమ్. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ వావ్ అనిపిస్తుంది. టీజర్లో అడుగడుగునా గౌతమ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతూ వర్మతో పాటు మరో తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇక ఆ ట్రైలర్ ఫై మీరు ఓ లుక్ వెయ్యండి.