పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘ఖుషీ’ చిత్రంలో నటించి ఆ తర్వాత పెద్ద హీరోల చిత్రాలలో కూడా నటించిన అందాలతార భూమిక గత కొంత కాలం నుండి వెండి తెరకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు తన భర్త భరత్ ఠాకూర్‌తో గొడవ పడిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయాలపై భూమిక ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాదు ఇప్పుడు భర్తతో ఉంటుందా..?? ఒంటరిగా ఉంటుందా..?? అనే విషయం కూడా క్లారిటీ లేదు. కానీ భూమిక ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడి ఉందట. అందుకే ఈ అమ్మడు అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ అమ్మడికి హీరోయిన్ ఛాన్స్‌లు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
హీరోయిన్గా అవకాశం ఇవ్వకున్నా కూడా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు అయినా ఇవ్వండి అంటూ భూమిక దర్శక నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తుంది. హీరో, హీరోయిన్‌కి అక్కగా, వదినగా, స్నేహితురాలిగా ఏ పాత్రలో అయినా కనిపించడానికి సిద్దమే అంటూ ఈ అమ్మడు అవకాశాల కోసం తెగ ఆరాటపడుతుంది. భూమిక ‘ఎమ్మెస్ ధోని’ చిత్రంలో హీరోకి అక్కగా కనిపించింది. ఎలాంటి పాత్రలు అయినా కూడా తనకేం అభ్యంతరం లేదని అవకాశాల కోసం దర్శక నిర్మాతల చుట్టూ తిరుగుతోంది. అందంతో పాటు మంచి నటన కౌశలం ఉన్న ఈ అమ్మడికి అక్క, వదిన పాత్రలు వస్తాయా..? చూడాలి.