తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత దేవినేని మృతి పట్ల విజయవాడ ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు దేవినేని మృతికి సంతాపం తెలియజేశారు. ఇక వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ ద్వారా దేవినేని నెహ్రూ మరణంపై స్పందించాడు. వర్మ ఇటీవల తెరకెక్కించిన ‘వంగవీటి’ సినిమాలో దేవినేని నెహ్రూను హీరోగా చూపించిన విషయం తెల్సిందే. వంగవీటి సినిమా సమయంలోనే పలు సార్లు దేవినేని కుటుంబ సభ్యులతో వర్మ భేటీ అవ్వడం జరిగింది. సినిమాకు సంబంధించిన పలు విషయాల్లో దేవినేని వారి సహాయ సహకారం వర్మకు అందినట్లుగా అప్పుడు చర్చ జరిగింది.
దేవినేని మరణంతో వర్మ ట్విట్టర్లో స్పందిస్తూ… ‘దేవినేని నెహ్రూ మరణం నాకు పెద్ద షాక్. ఆయనతో నేను గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఒక బలమైన రాజకీయ శక్తికి చిహ్నంగా నేను భావిస్తాను అంటూ వర్మ ట్వీట్ చేశాడు. దేవినేని మరణం పట్ల తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి లోకేష్‌లు సంతాపం తెలియజేశారు. దేవినేని నెహ్రూ పార్దీవ దేహాన్ని విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.