అందాలతార సమంత, అక్కినేని యువ హీరో నాగచైతన్యలు గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు. పెళ్లి ముహుర్తం దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ ఇద్దరు చాలా బిజీ అవుతున్నారు. సమంత ప్రస్తుతం రామ్ చరణ్ సరసన సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోంది. ఇది కాక మరో రెండు చిత్రాలు కూడా సమంత చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతోంది.
ప్రేమలో ఉన్నప్పటి నుండే సహజీవనం చేస్తున్న సమంత, చైతూలు పెళ్లి ముహుర్తం దగ్గరపడుతుండగా విడి విడిగా ఉంటున్నారు. సమంత చరణ్ చిత్రం కోసం గోదావరి సమీప ప్రాంతాలలో ఉంటుంది. ఇక చైతూ తన చిత్రం కోసం హైద్రాబాద్‌లో షూటింగ్‌లో పాల్గోంటున్నాడు. ఇలా ఈ ఇద్దరు కూడా ఒకరు తెలంగాణలో మరొకరు హైద్రాబాద్‌లో విడి విడిగా ఉంటున్నారు. పాపం వదిలి ఉండలేక పెళ్లికి ముందే కలిసున్న వీరు సినిమాల కారణంగా విడి విడిగా ఉండాల్సి వస్తోంది అని తెగ ఫీలవుతున్నారు. ఈ విషయాన్ని సన్నిహితులతో చెబుతూ బాదపడుతున్నారు.