మొత్తానికి శ్రీను వైట్ల అందరి అంచనాలు తలదన్నేలా హ్యాట్రిక్ కొట్టాడు.. ఆగడు, బ్రూస్ లీ వంటి డిజాస్టర్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవడం తో ఈసారి ఎలాగైనా హిట్ కొడతాడని అంత నమ్మరు..ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మిస్టర్ సినిమా రాబోతుందని అందరూ భావించారు..కానీ వారి అంచనాలను తలకిందులు చేసాడు. సరికొత్త ప్రేమకథ మిస్టర్ అంటూ ప్రమోషన్స్ చెప్పినప్పటికీ…థియేటర్స్ లో మాత్రం నరకం చూపించాడు.
ఫస్ట్ హాఫ్ లోనే సినిమా అంత చూపించి…సెకండ్ హాఫ్ సాగదీతతో అతడు కాలక్షేపం చేసి చూసేవారికి మాత్రం పరుగులు పెట్టించాడు. కేవలం శ్రీను వైట్ల మాత్రమే కాదు..మిగతా టెక్నీషియన్స్ కూడా అతడికి హెల్ప్ చేయలేకపోయారు. మ్యూజిక్..కథ..ఎడిటింగ్..మాటలు ఇలా అన్ని విభాగాలు విఫలం అయ్యాయి..ఈ మూవీ ఫై ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీనువైట్ల, వరుణ్ తేజ్ కు నిరాశే మిగిలింది.