తట్టుకోలేక మందుతోనే సరిపెట్టుకుంటుంది

Nayana-Srimanthuduఅందాలతార నయనతార ప్రస్తుతం తమిళంలో బిజీ బిజీగా వరుస చిత్రాలకు సైన్‌ చేస్తోంది. పారితోషికం విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నా కూడా ఈ అమ్మడికి వరుస ఆఫర్‌లు వస్తూనే ఉన్నాయి. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకునే నయన్‌కు అడిగినంత ముట్టజెప్పడానికి తమిళ దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. వయస్సు పెరుగుతున్నా కూడా తరగని అందంతో ఈ అమ్మడు తమిళంలో టాప్‌గానే ఓ వెలుగు వెలుగుతోంది. ప్రేమ విషయంలో ఇప్పటికే పలుసార్లు మోసపోయిన ఈ అమ్మడు ప్రస్తుతానికి పెళ్లి విషయం పక్కన పెట్టి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలన్నిటికి కూడా ఒకే చెబుతోంది.

నయన్‌ ప్రస్తుతం ‘వేలైక్కరన్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తుండగా చిన్న చిన్న గాయాలయినాయట. షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్‌ సన్నివేశం తెరకెక్కిస్తుండగా నయన్‌కు చిన్నపాటి ప్రమాదం సంభవించింది. కాగా తాను ఆసుపత్రికి వెళితే ఎక్కడ షూటింగ్‌ ఆగిపోతుందో అని, ఒక సినిమా అలస్యం అయితే అన్నిటి మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశ్యంతో ఆసుపత్రికి వెళ్లకుండా కేవలం మందులతోనే సరిపెట్టుకుంటుంది. నొప్పి చాలా బాధ పెడుతున్న కూడా పెయిన్‌ కిల్లర్‌ మందు వేసుకుంటూ షూటింగ్‌లో పాల్గోంటుంది. ఇంత కరెక్ట్‌గా సమయాన్ని ఫాలో అవుతుంది కాబట్టే ఈ అమ్మడిపై తమిళ దర్శకనిర్మాతలకు మంచి నమ్మకం.